పశ్చిమ బెంగాల్, తెలంగాణలో అధికారంలోకి వస్తాం !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈసమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్నిఅనవసర విమర్శలు చేస్తోందన్నారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. కాశ్మీర్‌ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం అంతర్జాతీయ సమస్యగా చేస్తోందని మండిపడ్డారు. కరోనా, సర్జికల్ స్ట్రైక్స్‌, రాహుల్‌ను ఈడీ ప్రశ్నించడం వంటి అంశాలను రాజకీయాల కోసం వాడుకుంటోందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో తమకు సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పారు. ఆ ప్రాంతాల్లో పాలిస్తున్న ప్రభుత్వాలపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాలు సత్పలితాలను ఇస్తోందని..ఇక్కడి నుంచే 2024 శంఖారావాన్ని పూర్తిస్తామన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతుందన్నారు. దక్షిణాదిలో తిరుగులేని స్థితికి చేరుతామని..నేతలు, కార్యకర్తలు ఇందు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)