పిల్లల పై సినిమా ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డారు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 3 July 2022

పిల్లల పై సినిమా ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డారు !


సీనియర్ నటుడు చంద్రమోహన్ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. హీరోగా, నటుడుగా కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నేటి తరం హీరోలతో కూడా ఎన్నో సినిమాలలో నటించి ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు ఈయన. నటుడుగా చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధం లేకుండా అన్ని సినిమాలలో నటిస్తూ ముందుకు వెళ్లడమే కాకుండా ఆ పాత్రకు తగిన న్యాయం   చేస్తాడు చంద్రమోహన్. అయితే సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది తమ పిల్లలను సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఈ నటుడు మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీలోకి రాకుండా చూసుకున్నారు.  తాజాగా ఒక ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడుతూ పిల్లల్ని సినిమాల్లోకి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్న ఎదురైందట.. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు బాగానే ఉన్నారు అందులో చిన్నమ్మాయి చాలా బాగుంటుంది. ఈ విషయం భానుమతి గారు కూడా చాలాసార్లు చెప్పారు నేనప్పుడు ఇంట్లో ఉండేవాడిని కాదు ఉదయం వెళితే ఎప్పుడో రాత్రికి ఇంటికి వచ్చేవాన్ని, మళ్లీ ఉదయం లేవగానే షూటింగ్ కి వెళ్లి పోయేవాడిని దీంతో పిల్లలను చాలా మిస్ అయ్యే వారిని తెలిపారు. ఆ సమయంలో తమ పిల్లలని షూటింగ్ సెట్స్ కి తన భార్య తీసుకువచ్చేది కానీ వాళ్ళు నన్ను గెటప్ లో చూసి గుర్తుపట్టేవారు కాదు అప్పుడే భాగమతి గారు పిల్లలు బాగున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ గా లాంచ్ చేద్దాం అనుకున్నారు కానీ నేను మాత్రం సినిమా ప్రభావం వారి మీద పడకుండా పలు జాగ్రత్తలు పడ్డాను. వాళ్ళకి యాక్టింగ్ రుచి చూపిస్తే చాలు మళ్ళీ షూటింగ్ ఎప్పుడు అంటారని భయపడి వాళ్ళ దగ్గర సినిమా ప్రస్తావన ఎప్పుడు తీసుకు రాలేదని తెలిపారు. తమ పిల్లలని నటుల్ని చేయాలనే ఆలోచనల తన భార్య కానీ తను కానీ ఏనాడు అనుకోలేదని.. కేవలం సినిమాలకు దూరంగా పెంచాలనుకున్నాం. అలాగే పెంచాం ప్రస్తుతం పిల్లలిద్దరూ బాగానే చదువుకుంటున్నారు ఇద్దరూ కూడా గోల్డ్ మెడలిస్టులు మంచి ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. 

No comments:

Post a Comment