ఎఫ్సీఆర్ఏ సైట్ నుంచి ఆ ఎన్‌జీవోల సమాచారం తొలగింపు

Telugu Lo Computer
0


విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం వెబ్‌సైట్‌ను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధునికీకరించింది. అనుమతులు రద్దయిన నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఎన్‌జీవోల వార్షిక రిటర్నులకు సంబంధించిన కీలక సమాచారాన్ని తొలగించింది. ఈ చర్యలకు కారణాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఓ అధికారి మాట్లాడుతూ, ఈ సమాచారం ప్రజలకు అవసరం లేదని తాము భావించామని చెప్పారు. గతంలో ఎఫ్‌సీఆర్ఏ వెబ్‌సైట్‌లో ఎఫ్‌సీఆర్ఏ అనుమతులుగల ఎన్జీవోలు, విదేశీ విరాళాలను స్వీకరించేందుకు ముందస్తు అనుమతిగల ఎన్జీవోలు, లైసెన్సులు రద్దయిన ఎన్జీవోలు, కాల పరిమితి ముగిసిన ఎన్జీవోలు, ఎన్జీవోల వార్షిక రిటర్నులు వంటి వివరాలన్నీ ఉండేవి. తాజాగా అప్‌డేట్ చేసిన తర్వాత అన్ని కేటగిరీలలోని ఓవరాల్ డేటా ఉంది కానీ, సవివరమైన జాబితాలను తొలగించారు. ఎన్జీవోల వార్షిక రిటర్నులను చూడటానికి అవకాశం లేకుండాపోయింది. ఎన్జీవోలు స్వీకరించిన విదేశీ విరాళాలకు సంబంధించిన త్రైమాసిక ఖాతాల సమాచారాన్ని కూడా తొలగించారు. అనుమతులు రద్దయిన ఎన్జీవోల సంఖ్య మాత్రమే కనిపిస్తోంది. అదేవిధంగా వార్షిక రిటర్నులను దాఖలు చేసిన ఎన్జీవోల సంఖ్య కనిపిస్తోంది. ఎన్జీవోలపై భారాన్ని తగ్గించేందుకు ఎఫ్‌సీఆర్ఏ నిబంధనలలో అనేక మార్పులను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూలై 1న ప్రకటించింది. `

Post a Comment

0Comments

Post a Comment (0)