భారత్‌లోని రాయబారిని తొలగించిన ఉక్రెయిన్ !

Telugu Lo Computer
0


భారత్‌తో పాటు జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే, హంగేరీలోని ఉక్రెయిన్ రాయబారులను తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ అధ్యక్షుడి వెబ్‌సైట్‌లో పెట్టారు. అయితే, ఆయా దేశాల రాయబారులను ఎందుకు తొలగిస్తున్నామన్న విషయాన్ని ఉక్రెయిన్ తెలపలేదు.  ఆయా రాయబారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నారా? అన్న విషయంపై కూడా స్పష్టతనివ్వలేదు. రష్యా తమ దేశంపై దాడి చేస్తోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ రాయబారులు అందరూ విదేశాల మద్దతు కోరాలని, అలాగే, ఆ దేశాల మిలిటరీ సాయం అడగాలని జెలెన్ స్కీ సూచించారు. యుద్ధం కొనసాగుతోన్న వేళ జర్మనీలోని రాయబారిని కూడా ఉక్రెయిన్ తొలగించడం పట్ల విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)