రూ.2.5 కోట్ల స్కాలర్ షిప్ పొందిన ప్రేమ్

Telugu Lo Computer
0


బీహార్ కు చెందిన కూలీ కొడుకు అమెరికాలో గ్రాడ్యుయేషన్ కోసం రూ.2.5 కోట్ల స్కాలర్ షిప్ పొందాడు. పాట్నాకు సమీపంలోని గోన్పురాకు చెందిన ప్రేమ్ (17) పెన్సిల్వేనియాలోని ప్రతిష్టాత్మక లాఫాయేట్ కాలేజీలో నాలుగేళ్ల పాటు మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకోనున్నాడు. ఇది అమెరికాలోని టాప్-25 కాలేజీల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరుగురికి మాత్రమే ఈ స్కాలర్ షిప్ వచ్చింది. అందులో ప్రేమ్ ఒకడు కావడం తమకు గర్వ కారణం అంటున్నారు గ్రామస్తులు. ప్రేమ్ తండ్రి రోజువారీ కూలీ. తల్లి పదేళ్ల క్రితం చనిపోయింది. రూ.2.5 కోట్ల స్కాలర్ షిప్ కు అర్హత సాధించడం పట్ల ప్రేమ్ బంధువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ అంటూ ప్రేమ్ ను ప్రశంసిస్తున్నారు. స్కాలర్ షిప్ ఇవ్వడమే కాదు.. ప్రేమ్ ఇతర ఖర్చులను కూడా కాలేజీ వాళ్లే చూసుకుంటారు. లాఫాయేట్ కాలేజీ 1826లో స్థాపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)