భార్యను చెట్టుకు కట్టేసి కొట్టిన భర్త !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని, బన్స్‌వారా ప్రాంతంలో ఒక మహిళ, తన భర్త స్నేహితుడితో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోంది. దీనిపై భర్తకు అనుమానం ఉండేది. ఈ క్రమంలో ఇద్దరినీ ఒకేసారి పట్టుకున్నాడు. తర్వాత భార్యను చెట్టుకు కట్టేసి, ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దాదాపు ఏడు గంటలు ఆమెను చెట్టుకు కట్టేసే ఉంచాడు. మరో చెట్టుకు తన స్నేహితుడిని కూడా కట్టేశాడు. అతడిపై కూడా దాడి చేశాడు. దీనికి నిందితుడి సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. తనను రక్షించమని మహిళ వేడుకున్నా ఎవరూ సహకరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్ని కొందరు వీడియో తీశారు. తర్వాత ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ భర్త, సోదరుడితో పాటు, మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు నిందితులు మైనర్లు కావడం విశేషం. ఈ దారుణ ఘటనపై మహిళా కమిషన్ స్పందించింది. నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి, బాధితులకు తక్షణం వైద్య సహాయం అందించాలని ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)