ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలీ బీజేపీ ఎమ్మెల్యే విక్రం సైనీ ..ప్రజలు తమ ఇల్లు, షాపుల వంటివి సురక్షింతంగా ఉండాలంటే రాళ్లు, గడ్డపారలు, తుపాకులు అందుబాటులో ఉంచుకోవాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చెశారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.  ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కేంద్ర సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్, ఎమ్మెల్యే విక్రమ్ సైనీలకు జన్సత్ తహసీల్ ప్రాంతంలోని వాజిద్‌పూర్ కావాలి గ్రామంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రం సైనీ మాట్లాడుతూ..పోలీసులు ఎన్ని రోజులని..ఎంతమందినని కాపాడతారు? వారికి సమాచారం అంది వారొచ్చేసరికి మీకు ఏమైన ప్రమాదం రావచ్చు..ఆందోళనకారులు మీ షాపులు ధ్వంసం చేయొచ్చు..అందుకే ముందు జాగ్రత్తగా మీ షాపుల్లో రాళ్లు, గడ్డపారలు, తుపాకులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వివాదంగా మారింది. ఆ వీడియోలో విక్రం సైనీ మాట్లాడుతూ.. ''రెండు పెట్టెల్లో రాళ్లు పెట్టుకోండి. నాలుగైదు గడ్డపారలు కూడా ఉంచుకోండి. మరో రెండు తుపాకులు కూడా దగ్గర పెట్టుకోండి. పోలీసులు మాత్రం ఎంతకాలమని పనిచేస్తారు? పోలీసులు వచ్చే సరికి మీ షాపులను ఆందోళనకారులు తగలబెట్టేస్తున్నారు. అందుకే ఆయుధాలను దగ్గర ఉంచుకోండి'' అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కొందరు నేతలు ఆయనను ఆపేయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం ''నన్ను మాట్లాడనివ్వండి. ఇది న్యూస్‌పేపర్లలో రాసుకోమనండి. టీవీల్లో చూపించుకోమనండి. ఐదేళ్ల వరకు ఎవరూ నన్నేమీ చేయలేరు. నాకు ఇంతకుమించిన కోరిక కూడా లేదు'' అంటూ ఏమాత్రం తగ్గేదిలేదు అన్నట్లుగాను..నేను చెప్పాలనుకున్నది చెప్పి తీరుతాను అన్నట్లుగా వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)