దేశంలో కొత్తగా 16,678 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో ఆదివారం 2,78,266 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 16,678 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. పాజిటివిటీ రేటు 5.99శాతానికి పెరిగింది. ప్పటి వరకు దేశంలో 86.68 కోట్ల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,30,713 (0.30%)గా మోదైంది. గడిచిన 24గంటల్లో 14,629 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ కోలుకున్నారు. దేశంలో 2020 నుంచి 4.36కోట్ల మందికి కొవిడ్ సోకగా.. రికవరీ రేటు 98.50శాతంగా ఉంది. ఆదివారం ఒక్కరోజే కొవిడ్ తో చికిత్స పొందుతూ 26మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 198.88 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను వైద్య సిబ్బంది అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)