డాక్టర్ టెస్సీ థామస్‌కు ఏపీజే అవార్డ్

Telugu Lo Computer
0


భారత దేశ క్షిపణి కార్యక్రమానికి నాయకత్వం వహించిన తొలి మహిళ డాక్టర్ టెస్సీ థామస్‌  ఏపీజే అవార్డ్, 2022కు ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్  ప్రదానం చేస్తారు. నూరుల్ ఇస్లాం ఉన్నత విద్యా కేంద్రం, నిమ్స్ మెడిసిటీ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాయి. డాక్టర్ టెస్సీ థామస్‌ను భారత దేశ క్షిపణి మహిళ  అని పిలుస్తారు. ఆమె రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ ఏరో సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. కన్యాకుమారి జిల్లా, కుమరకోవిల్‌లో ఉన్న నూరుల్ ఇస్లామ్ సెంటర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, NIMS Medicity కలిసి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాయి. నూరుల్ ఇస్లామ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఏపీ మజీద్ ఖాన్ నేతృత్వంలోని కమిటీ డాక్టర్ టెస్సీ థామస్‌ను ఈ పురస్కారం కోసం ఎంపిక చేసింది. ఈ పురస్కారాన్ని 2019లో ప్రారంభించారు. ప్రభుత్వ అధికారులు తమ రంగంలో సాధించిన విజయాలను గుర్తించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. జూలై 19న నెయ్యర్తింకరాయ్‌లో జరిగే కార్యక్రమంలో డాక్టర్ టెస్సీ థామస్‌కు ఈ పురస్కారాన్ని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రదానం చేస్తారు. పురస్కార గ్రహీతకు రూ.1 లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రం, స్మారక ట్రోఫీ అందజేస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)