కలెక్టరెట్‌లో కామాంధుడు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 July 2022

కలెక్టరెట్‌లో కామాంధుడు


తెలంగాణలోని కామారెడ్డి  జిల్లా కలెక్టరెట్‌లో సెక్యురిటీ గార్డ్‌గా పనిచేస్తున్న కిరణ్‌ పట్టణంలోని గోసంగి కాలనీలో నివాసముంటున్న టెన్త్ క్లాస్ విద్యార్దినికి మాయ మాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఇంట్లో బాలిక తల్లిదండ్రులు ఎవరూ ఉండకపోవడం గమనించి ఆమెపై గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈమధ్యనే బాధితురాలు టెన్త్ పూర్తి చేసింది. ఈనెల 7వ తేదిన బాధితురాలితో పాటు ఆమె ఇద్దరు చెల్లెళ్లలను బాసర తీసుకెళ్లాడు నిందితుడు. అక్కడే టెన్త్ విద్యార్దినిపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉండాల్సిన ముగ్గురు కుమార్తెలు రాత్రి అయినప్పటికి ఇంటికి రాకపోవడంతో తండ్రి సాయిలు ఆందోళనకు గురై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. తెల్లవారు జామున ముగ్గురు కుమార్తెలు ఇంటికి రావడంతో బాధితురాలి తండ్రితో పాటు గ్రామస్తులు మర్చిపోయారు. ఇంటికి వచ్చిన ముగ్గురు కుమార్తెల్లో రెండో కుమార్తె కడుపునొప్పి వస్తోందని తల్లికి చెప్పింది. బాధితురాలిని కుటుంబ సభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో నిందితుడు కిరణ్‌ తనపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలిపింది. బాధితురాలి కుటుంబ సభ్యులు కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అత్యాచారం చేసినట్లుగా అంగీకరించాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా ఎస్‌హెచ్‌ఓ నరేష్ తెలిపారు. బాలిక తల్లిదండ్రులు గుమస్తా కాలనీలో హోటల్‌ నడుపుకుంటూ బిడ్డల్ని చదివిస్తున్నారు. నలుగురు ఆడపిల్లలే కావడంతో పెద్ద కుమార్తె వివాహం చేశారు. మిగిలిన ముగ్గురిని ఇంట్లో ఉంచి హోటల్ వ్యాపారం చేసుకునేందుకు వెళ్లడం వల్లే ఇంతటి దారుణం జరిగినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. పోలీసులు ఆడపిల్లల్ని ఇంటి దగ్గర ఒంటరిగా వదిలిపెట్టిన సమయంలో వారి జాగ్రత్తలు, రక్షణపై కూడా దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు.

No comments:

Post a Comment