అబార్షన్ పిల్స్ వేసుకున్నమహిళ మృతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 July 2022

అబార్షన్ పిల్స్ వేసుకున్నమహిళ మృతి


ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో ఉన్న నౌబస్తా ప్రాంతానికి చెందిన గీతా యాదవ్ కు విపిన్ యాదవ్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మరోసారి గర్భం దాల్చింది. దీనిని ఇష్టం లేని భర్త, అబార్షన్ చేయించుకోవాలని సూచించాడు. అందుకోసం గీత కు అబార్షన్ పిల్స్ ఇచ్చాడు. అది వేసుకున్న కొద్దిసేపటికి గీత అస్వస్థతకు గురైరంది. తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం నౌబస్తాలోని నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. భర్త, అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతల మధ్యే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో మహిళ మృతికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. మహిళకు బలవంతంగా అబార్షన్ మెడిసిన్ ఇచ్చారని నిరూపిస్తే చట్టం ప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. 

No comments:

Post a Comment