గుర్రంపై స్విగ్గీ ఫుడ్ డెలివరీ

Telugu Lo Computer
0


ముంబైలో భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఫుడ్ డెలివరీ చేసేందుకు గుర్రం మీద వెళ్లాడు. అందుకే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.వాన చినుకు పడితే మహా నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఆ కష్టం అనుభవించిన వారికే తెలుస్తుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇటీవల ముంబైలో భారీగా వర్షాలు కురిసాయి. అందుకు తగ్గట్టే రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. ఇంతలో ఒక స్విగ్గీ బాయ్ కు ఆర్డర్ వచ్చింది. వర్షం కురుస్తోంది కదా అని ఆగిపోలేదు. వెంటనే ఆ పార్సిల్ తీసుకుని గుర్రం ఎక్కి డెలివరీ చేయటానికి బయలు దేరాడు.ఈ దృశ్యాన్ని ఒక వ్యక్తి తన కారులోంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూ స్విగ్గీ బాయ్ చేసిన పని చూసి వావ్ అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)