కొన్ని వస్తువులకు కేరళలో జీఎస్టీ అమలుచేయం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 20 July 2022

కొన్ని వస్తువులకు కేరళలో జీఎస్టీ అమలుచేయం !


నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడం పట్ల పలు రాష్ట్రాలు  వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'కుటుంబ శ్రీ' స్టోర్లు, చిన్న చిన్న దుకాణాల్లో 1, 2 కేజీల ప్యాకెట్ల రూపంలో విక్రయించే వస్తువులపై జీఎస్టీ విధించబోమని స్పష్టం చేసింది. అసెంబ్లీ వేధికగా బుధవారం ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రం అభ్యంతరం చెప్పినా వెనుకడుగు వేయమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే విషయమై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. చిన్న తరహా, చిరు వ్యాపారులపై పన్నులు వేయాలని మేం అనుకోవడం లేదని ఇప్పటికే కేంద్రానికి సీఎం విజయన్ సైతం లేఖ రాశారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కేరళ సీఎం విజయన్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు. కేరళలో మిల్లర్లు, చిన్న చిన్న దుకాణాలు నడిపేవారు సైతం వస్తువులను ముందుగానే ప్యాకేజీ చేసి విక్రయిస్తుంటారని, ప్యాక్ చేసి విక్రయించడమనేది సర్వసాధారణమైన విషయమని తలిపారు. ప్యాక్ చేసి విక్రయించే వస్తువులను తాజాగా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల చిన్న చిన్న దుకాణఆల్లో కొనుగోలు చేసే వినియోగదారులపై భారం పడుతుందని లేఖలో సీఎం విజయన్ తెలిపారు. ఇదిలాఉంటే కేరళలలో 'కుటుంబ శ్రీ' అనేది స్వయం సహాయక సంఘం. మహిళా సాధికారత కోసం ఉద్దేశించిన దేశంలో అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే. వీటి ఆధ్వర్యంలో చిన్న తరహా ఆహార శుద్ధి పరిశ్రమలు నడుస్తుంటాయి.

No comments:

Post a Comment