మంగు మచ్చలు - నిమ్మరసం - పాలు

Telugu Lo Computer
0


ముఖంపై ఎటువంటి మచ్చలున్నా పార్లర్ కి వెళ్లి డబ్బులను వృధా చేసినా ఫేస్ లో ఎటువంటి మార్పు రాదు. ముఖం మీద నల్ల మచ్చలు, మంగు మచ్చలు లాంటివి ఉంటే ఫేస్ అందంగా కనబడదు. అలాగే కొందరిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. ఇప్పుడు చాలామంది మంగు మచ్చలతో బాధపడుతున్నవారు వీటిని తగ్గించడం కోసం వివిధ రకాల ఆయింట్ మెంట్ లను రాస్తూ ఉంటారు. ఈ మచ్చల సమస్య తొలగిపోవాలంటే మన ఇంటిలోనే ఒక చక్కటి పరిష్కారం ఉంది. మన వంటింట్లో ఉండే వస్తువులతో ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. సాధారణంగా ఈ మంగు మచ్చలు అనేవి ఎక్కువగా బుగ్గలు, ముక్కుకు ఇరువైపులా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మెడ, భుజాలు, వీపు మీద కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి. ముఖంపై ఈ మచ్చలు ఉండడం వలన అందంగా ఉండేవారు కూడా అందహీనంగా కనిపిస్తారు.ఈ మచ్చలకి సాధారణ మచ్చలను తగ్గించే చిట్కాలను పాటిస్తే సరిపోదు. దీనికి మనం ఎప్పుడూ ఉపయోగించని చిట్కాను ఉపయోగించాలి. ఈ మచ్చలను తగ్గించడానికి నిమ్మరసం, పాలు చాలా బాగా సహాయపడతాయి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పాలు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని మంగు మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా రాసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు స్మూత్ గా మసాజ్ చేయాలి. తరువాత అరగంట అయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రంగా ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మంగు మచ్చలు అనేవి తొలగిపోతాయి. నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు మచ్చలను తగ్గించి ముఖం తెల్లగా మెరిసేలా చేస్తుంది. నిమ్మరసం మనకు ఇంటిలో సులువుగా దొరుకుతుంది. అలాగే పాలను ప్రతిరోజు వాడుతుంటాం. పాలలో ఉండే పోషకాలు ఈ మచ్చలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)