ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్‌ మృతి

Telugu Lo Computer
0

 



ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో మావోయిస్ట్‌ మృతి చెందాడు. మృతుడు కాటే కల్యాణే ఏరియా కమిటీ సభ్యుడు బుద్రం మర్కంగా గుర్తించారు. ఈ విషయాన్ని బస్తర్ రేంజ్ ఐజీ ధ్రువీకరించారు. భద్రత బలగాల కాల్పుల్లో హతమైన హతమైన మర్కంపై గతంలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.5లక్షల రివార్డ్‌ ప్రకటించింది. ప్రస్తుతం సంఘటనా ప్రాంతంలో బలగాలు సెర్చ్‌ ఆపరేసన్‌ కొనసాగిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు దాక్కున్నట్లు భద్రతా అనుమానిస్తున్నాయి. ఈ మేరకు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. మృతుడిపై దంతెవాడలో 15 కేసులు నమోదైనట్లు సమాచారం. మర్కంపై దంతేవాడ జిల్లాలో మానోయిస్టు కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్నాడు. పోలీసులకు సవాల్ విసురుతున్నాడు, కొన్ని రోజులుగా మర్కంపై టార్గెట్ గా బలగాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)