ప్రసాదంతో పాటు పొరపాటున 2.91 లక్షల కాష్ బ్యాగును ఇచ్చారు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 30 July 2022

ప్రసాదంతో పాటు పొరపాటున 2.91 లక్షల కాష్ బ్యాగును ఇచ్చారు !


కర్ణాటకలోని హనుర్ తాలుకాలోని మలిమహాదేశ్వర్ కొండపై ఉన్న గుడికి అమవాస్య సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్శనం వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారి లడ్డు ప్రసాదంతో పాటు పొరపాటున రూ. 2.91 లక్షల బ్యాగును భక్తుడికి అందజేశారు. ఆ తర్వాత తేరుకున్న అధికారి చూడగా డబ్బుల బ్యాగు కనిపించలేదు. బ్యాగు కోసం ఎంత వెతికినా జాడ లేదు. చివరకు సీసీటీవీ కెమెరాను పరిశీలించగా, పొరపాటున భక్తుడికి ఇచ్చిన విషయం బయటపడింది. ఈ డబ్బు దేవస్థానానికి సంబంధించినదని, ఖాతాలో జమ చేయడానికి తీయగా ఇలా జరిగిందని అధికారులు తెలిపారు. అయితే ఆ భక్తుడి గురించి మాత్రం ఇంకా తెలియరాలేదు.

No comments:

Post a Comment