రాజ్‌ఠాక్రేతో ఫడ్నవీస్‌ భేటీ

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ శుక్రవారం ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ఠాక్రేను దాదర్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఇద్దరు గంటన్నరపాటు సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణకు ముందు ఇద్దరి భేటి చర్చనీయాంశమైంది. ఎంఎన్‌ఎస్‌ ఏక్‌నాథ్‌ షిండే మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్‌ఠాక్రే తనయుడు అమిత్‌ ఠాక్రేకు కేబినెట్‌ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో రాజ్‌ఠాక్రేతో ఈ విషయంపై చర్చించేందుకు ఫడ్నవీస్‌ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తున్నది. ఇంతకుముందు మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సమయంలో రాజ్‌ఠాక్రే, ఏక్‌నాథ్‌ షిండే సంభాషణకు సంబంధించి వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే, ఠాక్రే ఆరోగ్యంపైనే షిండే ఫోన్‌ చేసినట్లు తెలిసింది. మరో వైపు హిందుత్వంపై ఉద్ధవ్ ఠాక్రేపై రాజ్‌ఠాక్రే నిరంతరం విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అలాగే ఏక్‌నాథ్‌ షిండే సైతం హిందుత్వంపై పలు ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)