మీడియా రిజిస్ట్రేషన్ చట్ట సవరణ ?

Telugu Lo Computer
0


మీడియా రిజిస్ట్రేషన్ కోసం దేశంలో కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. డిజిటల్ మీడియా నియంత్రణ కూడా ఆ చట్ట సవరణ ద్వారా చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో లేని డిజిటల్ మీడియాను ఇక ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ డిజిటల్ న్యూస్ సైట్ల ఉల్లంఘనలకు పాల్పడితే వాటిపై చర్యలు తప్పవు. వీలైతే రిజిస్ట్రేషన్ రద్దు లేదా భారీ పెనాల్టీ వేసే అవకాశాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లును సవరించేందుకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ చర్యలు చేపట్టింది. డిజిటల్ వార్తలను ప్రచురించేవారు రిజిస్ట్రేషన్‌కు దాఖలు చేసుకోవాలి. చట్టం అమలులోకి వచ్చిన 90 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద డిజిటల్ పబ్లిషర్స్ రిజిస్టర్ చేసుకోవాలి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఓ అప్పిల్లేట్ బోర్డును ఏర్పాటు చేసింది. అయితే ప్రతిపాదిత సవరణ బిల్లుకు ఇంకా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతి రాలేదని తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)