క్లౌడ్ బరస్ట్ అంటే ?

Telugu Lo Computer
0


కొన్ని దేశాలు క్లౌడ్ బరస్ట్  చేస్తూ మన దేశంలో భారీ వర్షాలకు కురిసేలా చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. కాళేశ్వరం అవినీతిని తప్పిచ్చుకోవడానికే క్లౌడ్ బరస్ట్  అంటున్నారని విమర్శించాయి. అయితే తెలంగాణలోక్లౌడ్ బరస్ట్ కు అవకాశం చాలా తక్కువ అని వాతావరణ శాఖ అధికాలు చెబుతున్నారు. క్లౌడ్ బరస్ట్ అనేది అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ వర్షపాతం నమోదు అవ్వడం. మేఘాల నుంచి ఒక్కసారిగా నీటి దార భూమి పైకి రావడాన్ని క్లౌడ్ బరస్ట్  అంటారు. అయితే ఇది కేవలం నియమిత ప్రాంతంలో మాత్రమే జరుగుతుంది. ముఖ్యంగా 20 నుంచి 30చ.కి.మీ పరిధిలో గంటకు 10సెం.మీ వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వరదలు వస్తాయి. 10 రోజుల క్రితం అమర్ నాథ్ యాత్రలో ఆకస్మికంగా భారీ వరదలు సంభవించాయి. దీనికి క్లౌడ్ బరస్ట్  కావొచ్చని అక్కడి అధికారులు అంచనా వేశారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో క్లౌడ్ బరెస్ట్ అవుతాయాని, దీని వల్ల భారీ ప్రాణ, ఆస్తి జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. క్లౌడ్ బెరస్ట్ ఎక్కువగా పర్వత ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లలో ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందనన్నారు. భారత వాతావరణశాఖ గణాంకాల ప్రకారం, 1970 నుంచి 2016 వరకు 30క్లౌడ్‌ బరస్ట్‌లు సంభవించాయి. 2002లో ఉత్తరాంచల్‌లో సంభవించిన కుంభవృష్టికి 28 మంది మృతి చెందారు. తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ కు అవకాశం చాలా తక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు క్లౌడ్ బరస్ట్ కారణం కాదని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)