నరేష్ - ముగ్గురు భార్యలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 4 July 2022

నరేష్ - ముగ్గురు భార్యలు !


సీనియర్ నటుడు నరేష్ వీకే, పవిత్రా లోకేష్‌, రమ్య రఘుపతి ట్రై యాంగిల్ ఫ్యామిలీ స్టోరీ ఇప్పుడు తెలుగు, కన్నడ మీడియాను కుదిపేస్తోంది. కర్నాటకలోని బెంగళూరులో ఓ హోటల్లో ఉన్న నరేష్‌, పవిత్రా లోకేష్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న రమ్య పవిత్రను చెప్పుతో కొట్టేందుకు కూడా ప్రయత్నించిందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు ? వారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఇప్పుడు వైరల్ అవుతోంది. నరేష్ నటి విజయనిర్మల కుమారుడు. విజయనిర్మల కృష్ణకు రెండో భార్య కాగా.. నరేష్ విజయనిర్మలకు మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం. అయితే కృష్ణను పెళ్లి చేసుకున్నాక.. కృష్ణ నరేష్‌ను తన కుమారుడిలాగానే చూసుకున్నారు. నరేష్ 1972లో బాలనటుడిగా పండంటికాపురం సినిమాతో తొలిసారిగా వెండితెరపై కనపించాడు. ఆ తర్వాత తన తల్లి విజయనిర్మల దర్శకత్వంలో 1982లో వచ్చిన ప్రేమసంకెళ్లు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. నాలుగు దశాబ్దాలుగా తండ్రి, మావయ్య పాత్రల్లో మెప్పిస్తునే ఉన్నాడు. ఇక నరేష్ పర్సనల్‌లైఫ్ విషయానికి వస్తే ముందుగా విజయనిర్మల స్వయంగా ఓ సంబంధం చూసి పెళ్లి చేశారు. సీనియర్ కెమేరామెన్ శ్రీను కుమార్తెతో నరేష్‌కు పెళ్లి చేశారు. ఈ దంపతులకు నవీన్ విజయ్‌కృష్ణ అనే కుమారుడు ఉన్నారు. నవీన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేసినా సక్సెస్ కాలేదు. మొదటి భార్యకు నరేష్ దూరమైనా నవీన్ ఆలనా, పాలనా.. అతడి వ్యవహారాలు మాత్రం పట్టించుకుంటూనే ఉంటాడు. వీరి మధ్య స్పర్థలు రాడంతో మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసిన నరేష్, దేవులపల్లి కృష్ణశాస్త్రి మనువరాలు రేఖా సుప్రియను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఓ కుమారుడు ఉన్నాడు. అయితే వీరు కూడా విడిపోయినా ఓ ఎన్జీవో కోసం మాత్రం కలిసి పని చేస్తున్నారు. నరేష్‌కు 50 ఏళ్లు దాటాక మాజీ మంత్రి నీలకంఠం రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్య రఘుపతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమె వయస్సు అప్పటికీ 30 ఏళ్ల లోపే. వీరి మధ్య 20 ఏళ్లకు పైగా ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా పెళ్లి చేసుకున్నారు. వీరికి కూడా ఓ కుమారుడు. అయితే పెళ్లయిన రెండేళ్లకే వీరు మనస్పర్థలతో విడిపోయారు. అయితే వీరి విడాకులు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇక ఇప్పుడు నరేష్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్‌తోనే కలిసి ఉంటున్నాడు. వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అటు పవిత్రా లోకేష్‌కు కూడా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తన భర్త సుచేంద్ర ప్రసాత్‌తో విడాకుల తర్వాత నరేష్ - పవిత్ర పెళ్లిజరిగే ఛాన్సులు ఉన్నాయంటున్నారు.

No comments:

Post a Comment