క్రిమినల్ ఎలిమెంట్స్‌ను బీజేపీ ఉపయోగిస్తోంది'

Telugu Lo Computer
0


మత విభజన, విద్వేషం ఎజెండాను కొనసాగించేందుకు బీజేపీ నేరపూరిత అంశాలను ఉపయోగించుకుంటోందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ  ఆరోపించారు. జమ్మూ ప్రాంతం నుంచి అరెస్టయిన లష్కరే తోయిబా ఉగ్రవాది జమ్మూలోని బీజేపీ ఐటీ సెల్ చీఫ్‌గా ఉండగా, ఉదయ్‌పూర్ టైలర్‌ను చంపిన వారిలో ఒకరు బీజేపీకి చెందిన వాడని మీడియా కథనాలపై ఆమె స్పందించారు. రాజకీయాల కోసం బీజేపీ ఇలాంటి క్రిమినల్ ఎలిమెంట్స్ ను ఉపయోగించుకుంటుందని అన్నారు. పార్టీలోని ఓ వర్గానికి చెందిన వారిని ఎదుటి వర్గం వారిపై దాడికి ఉసిగొల్పి ఆ తర్వాత వర్గాల మధ్య ఘర్షణలకు కారణం అవుతోందని, దీని వల్ల బీజేపీ లబ్దిపొందుతోందని అన్నారు. ఒక వేళ ఈ నిందితులకు ప్రతిపక్ష నాయకులతో సంబంధాలు ఉండి ఉంటే ఈ పాటికి ఎఫ్ఐఆర్ లు నమోదు చేసేవారని మండిపడ్డారు. ప్రతిపక్షాల విషయంలో ఒకలా తమ సొంత పార్టీకి చెందిన నేతల విషయంలో మరోలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా అటాక్ ఎలా జరిగింది, ఈ దాడి ద్వారా ఎవరు లబ్ది పొందారో అందరికి తెలుసని అన్నారు. ఇలాంటి ఘటనల ద్వారా బీజేపీ లాభ పడుతోందని ఫైర్ అయ్యారు. పుల్వామా దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న దేవేంద్ర సింగ్ ఇప్పుడు జైలు నుండి రిలీజ్ అయి బయట ఎందుకున్నాడని ప్రశ్నించారు. కాగా, భారీ ఆయుధాలతో ఉన్న ఇద్దరు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను కశ్మీర్ లోని రియాసీ జిల్లా టక్సన్ ధోక్ గ్రామస్థులు పట్టుకుని బంధించారు. వీరిలో ఒకరు రాజౌరీ మందుపాతరల పేలుళ్ల సూత్రధారి తాలిబ్ హుసేన్ కూడా ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ధైర్య సాహసాలు ప్రదర్శించిన గ్రామస్థులకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రూ. 5 లక్షలు, డీజీపీ రూ. 2 లక్షలు బహుమతిగా ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)