ఆయుస్మాన్ భారత్!

Telugu Lo Computer
0


దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుస్మాన్ భారత్ తీసుకొచ్చింది.  ఆరోగ్య ఖర్చులు భరించలేని పేద ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది.  ఈ పథకం కింద చికిత్స పొందుతున్న వ్యక్తి ఆస్పత్రి ఖర్చును చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు  ఉచిత చికిత్స పొందవచ్చు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకంగా చెప్పవచ్చు. ఈ పథకం కింద 10.74 కోట్ల కుటుంబాలకు ఏటా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కార్డు కోసం మీ సేవా కేంద్రానికి వెళ్లి, మీ పేరు జాబితాలో ఉందో లేదో అధికారులు తనిఖీ చేయుంచుకోవాలి. ఆయుష్మాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో మీ పేరు నమోదు అయి ఉంటే మీరు కార్డు పొందుతారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ వంటి అన్ని పత్రాలు, ఫొటో కాపీ, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో సదరు అధికారికి సమర్పించాలి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియని పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను అందిస్తారు. మీ ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్ రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో మీకు కార్డు వస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)