పాకిస్తాన్‌లో ప్రవక్తపై వ్యాఖ్యలకు ఆగ్రహం

Telugu Lo Computer
0


పాకిస్తాన్‌లోని శామ్‌సంగ్ సంస్థకు చెందిన ఒక వైఫై ఎనేబుల్డ్ డివైజ్ నుంచి మొహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వ్యాఖ్యలు ప్రసారం కావడంతో ముస్లింలు ఆగ్రహంతో రగిలిపోయారు. కరాచీలోని ఒక మాల్‌లో శామ్‌సంగ్ కంపెనీ ఆ డివైజ్‌ను ఏర్పాటు చేసింది. ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు ఆ డివైజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆందోళనకారులు శామ్‌సంగ్ కంపెనీ ఔట్‌లెట్లు, బిల్‌బోర్డులు, హోర్డింగ్‌లను నాశనం చేశారు. వీధుల్లో టైర్లు వేసి కాల్చారు. శామ్‌సంగ్ కంపెనీకి చెందిన 27 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మత విద్వేష వ్యాఖ్యలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ఎక్కడ జనరేట్ అయిందనే విషయమై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై శామ్‌సంగ్ కంపెనీ వివరణ ఇచ్చింది. మతపరమైన విషయాల్లో తమ సంస్థ తటస్థ వైఖరిని అవలంభిస్తుందని వివరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)