గాంధీ విగ్రహం ముందు విపక్షాల నిరసన

Telugu Lo Computer
0


నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రూరమైనదని విపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలు దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆహార వస్తువులపై జీఎస్టీ పెంపును సమర్థించుకున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. ప్రీ-ప్యాకేజ్‌డ్‌, లేబుల్‌ ఉన్న వస్తువులను సామాన్య, పేద ప్రజలు కొనకూడదా? అంటూ విపక్షాలు ప్రశ్నించాయి. నిత్యావసరాల వస్తువులపై జీఎస్టీ పెంచడాన్ని నిరసిస్తూ విపక్ష పార్టీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టాయి. పెరుగు, బ్రెడ్‌, పన్నీర్‌ వంటి ఆహార పదార్థాలపై పెంచిన జీఎస్టీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, డీఎంకే, లెఫ్ట్‌ పార్టీలు నినాదాలు చేశాయి. ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ పన్నులను గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ గా పేర్కొంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)