పిల్లలకు కాల్షియం ఉండే ఆహరం అందించండి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 26 July 2022

పిల్లలకు కాల్షియం ఉండే ఆహరం అందించండి !


పిల్లలకు తగినంత కాల్షియం అందకపోతే, ఎముకలు బలహీనంగా తయారవుతాయి. మునుమ్ముందు  పెళుసుగా మారి విరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే కాల్షియం వుండే ఫుడ్స్ సక్రమంగా అందిస్తే మంచిది. వారి ఆహారంలో కాల్షియం అధికంగా ఉండే అనేక రకాల ఆహారాలను చేర్చవచ్చు. పాలు, పెరుగు, చీజ్- పిల్లల ఆహారంలో పాలు, పెరుగు, జున్ను చేర్చండి. వీటిని అనేక విధాలుగా తినవచ్చు. పనీర్ కూర, మిల్క్ షేక్, పెరుగు రైతా చేయవచ్చు. ఈ ఆహారాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. బాదం చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైనది. బాదంపప్పులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిని పిల్లల ఆహారంలో బాదంను చేర్చవచ్చు. నానబెట్టిన బాదం లేదా బాదంపప్పును షేక్‌లా చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. పచ్చని కూరగాయలు- పిల్లల ఆహారంలో పచ్చి కూరగాయలను చేర్చండి. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. బీన్స్, బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌ని డైట్‌లో చేర్చుకోవచ్చు. వీటిలో క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. సోయాబీన్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీరు పిల్లల ఆహారంలో సోయా పాలు, టోఫుని కూడా చేర్చవచ్చు.

No comments:

Post a Comment