ఢిల్లీ పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 26 July 2022

ఢిల్లీ పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు మూడో రోజు కూడా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. దీంతో రాహుల్ తో పాటు 18 మంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడిన రాహుల్ గాంధీ రోడ్డుమీద బైటాయించారు. దీంతో రాహుల్ కు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎట్టకేలకు రాహుల్ తో పాటు 18 మంది కాంగ్రెస్ ఎంపీలను..పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీని పలుమార్లు విచారించిన ఈడీ రెండు రోజులుగా సోనియాగాంధీని కూడా విచారిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు,కీలక నేతలు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈడీ కేసుతో పాటు ధరల పెరుగుదల, జీఎస్టీపై కాంగ్రెస్ శ్రేణులు పార్లమెంట్ ఆవరణ నుంచి విజయ్ చౌక్ వరకు పాదయాత్ర చేపట్టారు.దీంతో ఢిల్లీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోలీసులు కాంగ్రెస్ మార్చ్ ను అడ్డుకున్నారు. దీంతో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో పోలీసుల తీరును నిరసనగా రాహుల్ గాంధీ రోడ్డుమీద బైఠాయించారు. దీంతో పోలీసులు రాహుల్ ను అతనితో పాటు 18మంది ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో దీపేందర్ హుడా, మల్లిఖార్జున ఖర్గేలు కూడా ఉన్నారు. పోలీసుల సూచనలమేరకే తాము నిరసలు తెలుపుతున్నారు అరెస్టులు చేయటం అక్రమం అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఇటువంటి విధానాలు ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కటమేనన్నారు. కానీ ఇటువంటి అరెస్టులకు భయపడేది లేదని స్పష్టంచేశారు.

No comments:

Post a Comment