రైలు కంపార్టుమెంట్‌లో హడలెత్తిచ్చిన పాము

Telugu Lo Computer
0


కేరళలో  తిరువనంతపురం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్5 కంపార్టుమెంట్‌లో రాత్రి పది గంటల సమయంలో ప్రయాణికులు పామును చూశారు. తిరూర్ దాటిన తర్వాత ఈ పామును లగేజ్ కింద గమనించారు. వెంటనే హడలిపోయిన ప్రయాణికులు టీసీకి సమాచారం అందించారు. వెంటనే టీసీ సమాచారాన్ని రైల్వే ఉన్నతాధికారులకు అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై రైలును తరువాతి స్టేషన్ అయిన కోజికోడ్‌లో ఆపారు. అంతలోపే పాము గురించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. పాముల్ని పట్టగలిగే నిపుణులతో అటవీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. రైలు కోజికోడ్ స్టేషన్‌లో ఆగగానే అటవీ అధికారులు, ఇతర సిబ్బంది ప్రయాణికుల్ని బయటకు దింపేశారు. దాదాపు గంటసేపటికిపైగా కంపార్టుమెంట్లలో తనిఖీలు నిర్వహించారు. అయితే, పాము ఎక్కడా కనిపించలేదు. కానీ, పాము రైలులో ఉన్నప్పుడు కొందరు ప్రయాణికులు ఫొటోలు కూడా తీశారు. అధికారులు ఆ ఫోటోల్లో ఉన్న పామును పరిశీలించారు. అదంత ప్రమాదకరమైనది కాదన్నారు. ఏదైనా రంధ్రం గుండా పాము బయటకు వెళ్లి ఉండొచ్చని, భయపడాల్సిందేమీ లేదని చెప్పారు. తర్వాత రైలు తిరిగి ప్రయాణమైంది. మొత్తానికి పాము రైలు ప్రయాణికుల్ని, అధికారుల్ని హడలెత్తించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)