జబర్దస్త్ విడాలంటే భయం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 20 July 2022

జబర్దస్త్ విడాలంటే భయం !


జబర్దస్త్ లో విభిన్నమైన పంచులు వేస్తూ బాగా అలరిస్తూ ఉంటాడు. 2013 వ సంవత్సరంలో ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రాం లో రాకెట్ రాఘవ తన టీం తో ఎంట్రీ ఇవ్వడం జరిగింది .ఇప్పటికీ ఎన్నో వందల స్కిట్లతో అలరిస్తూ ఉన్నారు. జబర్దస్త్ టీం లో ఎన్నో మార్పులు, ఎంతోమంది కమెడియన్లు మారినా కూడా రాకెట్ రాఘవ మాత్రం ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని జబర్దస్త్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఇంటర్వ్యూలో రాఘవ మాట్లాడుతూ జబర్దస్త్ షో ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. అలాగే ఆ షో కి వచ్చే కొంతమంది కమెడియన్ల నుంచి కూడా మరికొన్ని విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. జబర్దస్త్ మొదట్లో కన్నా ఇప్పుడే చాలా బాగుంది అని అతి తక్కువ సమయంలోనే ఎక్కువ కామెడీ అందించగలుగుతున్నామని తెలిపారు. అలాగే జబర్దస్త్ ను వీడి వెళ్లడం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. జబర్దస్త్ నుండి బయటకు వెళ్ళక పోవడానికి రెండు కారణాలు ఉన్నాయి.  మొదటిది సంతృప్తి అనేది ఇక్కడ చాలా దొరుకుతుంది. అందుచేతన నేనిక్కడే ఉండాలనుకుంతున్నాను. ఇక రెండవది ఇక్కడి నుంచి వెళ్ళిన వారి పరిస్థితి చూస్తే నాకు చాలా భయం వేస్తుంది వదిలి వెళ్ళిపోతే ఈ ప్లేస్ మళ్లీ మనకు దొరకదు. అందుచేతనే నాకు వెళ్లాలంటే భయమని అన్నారు. మొదట్లో తనపై వచ్చిన కోల్డ్ వార్ గురించి అడగగా అసలు నాకు దాని గురించి తెలియదని, నేను వివాదాలకు చాలా దూరంగా ఉంటానని  రాకెట్ రాఘవ తెలిపారు. జబర్దస్త్ వీడిన వారందరూ వారి కారణాలవల్ల వారు విడిచి వెళ్లడం జరిగింది. వారి గురించి నేను అసలు ఏమీ మాట్లాడనని అన్నారు. 

No comments:

Post a Comment