ఓట్స్‌తో ఊతప్పం !

Telugu Lo Computer
0


టిఫిన్లను కాస్త వెరైటీగా చేసుకుంటే కొత్త రుచిని ఆస్వాదించడంతోపాటు, శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. తయారీకి  కావలసినవి: ఓట్స్‌ - అరకప్పు, బియ్యప్పిండి - పావు కప్పు, పెరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, ఉల్లిపాయ ముక్కలు - రెండు టేబుల్‌ స్పూన్లు, క్యారట్‌ ముక్కలు - రెండు టేబుల్‌ స్పూన్లు, టొమాటో తరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు. కొత్తిమీర తరుగు - రెండేసి టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం : ముందుగా ఓట్స్‌ను మిక్సీజార్‌లో వేసి పొడి చేసుకోవాలి, ఓట్స్‌ పొడిలో ఉప్పు, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి గరిటజారుగా కలుపుకోవాలి, పాన్‌పై నూనె వేసి పిండిని మరీ పలుచగా కాకుండా, మందంగా కాకుండా మీడియం దోసెలా వేసుకోవాలి, ఇప్పుడు క్యారట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, కొత్తిమీర తరుగుని ఒక గిన్నెలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి, ఊతప్పం ఒకవైపు కాలిన తరువాత క్యారట్‌ ముక్కల మిశ్రమాన్ని ఊతప్పం మొత్తం చల్లుకుని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. పిండిమొత్తాన్ని ఇదే విధంగా వేసుకుని ఏదైనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)