మూలశంఖం - ఉపశమనం !

Telugu Lo Computer
0


పురీషనాళం చుట్టూ ఉండే రక్తనాళాల్లో హెమరాయిడ్స్(పైల్స్) సమస్య ఏర్పడుతుంది. క్రమరహిత ఆహారమే దీనికి ప్రధాన కారణం అని వైద్యులు చెబుతున్నారు. హేమోరాయిడ్స్(పైల్స్) రెండు రకాలు. రక్తనాళాల వాపు అంతర్గత హేమోరాయిడ్లలో కనిపించదు, కానీ బాహ్య హేమోరాయిడ్లలో ఇది పాయువు వెలుపల కనిపిస్తుంది. విపరీతమైన నొప్పి, రక్తస్రావం సమస్య ఉంటుంది. హేమోరాయిడ్స్ కోసం కొన్ని ఇంటి నివారణలు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వ్యాధికి ప్రధాన కారణం.. క్రమరహితమైన దినచర్య, ఆహారం. ఊబకాయం, మలబద్ధకం, మితిమీరిన లైంగిక సంపర్కం, ప్రేగులో ఒత్తిడి, చెడు జీవనశైలి దీనికి కారణాలు. అధిక శారీరక ఒత్తిడి, మాంసాహారం తీసుకోవడం, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్స్ వంటి మరికొన్ని అనిశ్చిత కారణాలు కూడా ఈ సమస్యను సృష్టిస్తాయి. దురద, పురీషనాళం దగ్గర నొప్పి, మలవిసర్జన సమయంలో నొప్పి, రక్తస్రావం ఉంటుంది. హెమోరాయిడ్లను వదిలించుకోవడానికి హోమ్ రెమిడీస్ ఉన్నాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేసి, ఒక ప్లాస్టిక్ టబ్‌లో గోరువెచ్చని నీటిని పోయాలి. అందులో కాసేపు కూర్చోవాలి. తద్వారా ఆ ప్రాంతం మెత్తబడి నొప్పి తగ్గుతుంది. ఫైల్స్ సమస్యతో బాధపడేవారు 15 నిమిషాల పాటు ఆ ప్రాంతానికి ఐస్ ప్యాక్‌ అప్లై చేయాలి. హేమోరాయిడ్స్‌ సమస్యతో బాధపడేవారు 2-3 అత్తి పండ్లను వేడి నీళ్లతో కడిగి గాజు పాత్రలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని తిని, దాని నీటిని కూడా తాగాలి. అత్తి పండ్లను రెండు-మూడు వారాల పాటు తీసుకోవడం వలన ఫైల్స్ సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. మజ్జిగ, జీలకర్ర పైల్స్‌ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దాని ప్రయోజనాలు మూడు నుండి నాలుగు రోజుల్లో కనిపిస్తుంది. మజ్జిగకు బదులుగా జీలకర్ర నీటిని కూడా అధికంగా తాగొచ్చు. అర టీస్పూన్ జీలకర్ర పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి తాగాలి. పైల్స్‌ను వీలైనంత త్వరగా నయం చేయడానికి ఇది ఉత్తమ పరిష్కారం. రెండు లీటర్ల మజ్జిగలో యాభై గ్రాముల జీలకర్ర మిక్స్ చేసి, దాహం వేసినప్పుడల్లా ఈ మిశ్రమాన్ని నీటికి బదులు తాగండి. ఫైల్స్ సమస్యతో బాధపడేవారు.. ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల నొప్పి క్రమంగా తగ్గుతుంది. సమస్య నుంచి క్రమంగా ఉపశమనం లభిస్తుంది. ఫైల్స్ సమస్య నుంచి బయటపడాలంటే మంచి నిద్ర చాలా ముఖ్యం. సమయానికి తింటూ, సమయానికి నిద్రపోవాలి. మంచి ఆహారం, నిద్ర ఫైల్స్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే నీరు కూడా, ఇతర హెల్తీ డ్రింక్స్ బాగా తాగాలి.


Post a Comment

0Comments

Post a Comment (0)