స్టార్టప్‌ కేపిటల్‌గా బెంగళూరు కు మొదటి స్థానం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 3 July 2022

స్టార్టప్‌ కేపిటల్‌గా బెంగళూరు కు మొదటి స్థానం !


దేశ స్టార్టప్‌ కేపిటల్‌గా బెంగళూరు తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 46 యూనికార్న్‌లు ఉండగా తదుపరి స్థానాన్ని ఢిల్లీ 25 యూనికార్న్‌లతోనూ, ముంబై 16 యూనికార్న్‌లతోనూ నిలిచాయి. హరూన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నగరంలో శనివారం ఇండియా ఫ్యూచర్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ను విడుదల చేసింది. దేశంలో రానున్న నాలుగేళ్లలో 122 కొత్త యూనికార్న్‌లు రావచ్చునని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో 84 యూనికార్న్‌లు, 51 గేజలర్స్‌, 71 చీటాస్‌ ఉన్నాయి. 2021 ఇండెక్స్‌తో పోలిస్తే వీటి ప్రగతి గణనీయంగా పెరగడం గమనార్హం. గత ఏడాది దేశంలో 51 యూనికార్న్‌లు, 32 గేజలర్స్‌, 54 చీటాస్‌ ఉన్న సంగతి తెలిసిందే. దేశపు ఫ్యూచర్‌ యూనికార్న్‌ 49 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 36 శాతం పెరుగుదల ఉండడం గమనార్హం. ఇండెక్స్‌ విడుదల అనంతరం ఏఎ్‌సకే ప్రైవేట్‌ వెల్త్‌ హరూన్‌ ఇండియా సహ సంస్థాపకుడు కైవల్య వొహ్రా మాట్లాడుతూ స్టార్టప్‌ పరుగులో బెంగళూరు అగ్రగామిగా ఉండడంతోపాటు తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుందన్నారు. సంస్థ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ సాలూజా శనివారం మీడియాతో మాట్లాడుతూ అమెరికా, చైనా తర్వాత స్టార్టప్‌ రంగంలో భారత్‌ దూసుకుపోతుండడం శుభపరిణామమన్నారు. ఈ రంగంలో ఆవిష్కరణలు, నైపుణ్యభరిత ఉద్యోగాలకు గణనీయ అవకాశాలు ఉన్నాయని సంస్థ ప్రధాన పరిశోధకుడు అనాస్‌ రెహమాన్‌ మీడియాకు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే యూనికార్న్‌ల ప్రగతి 65 శాతం, గాజెలర్ల ప్రగతి 59 శాతం, చీటాల ప్రగతి 71 శాతం ఉండడం సాధారణ విషయమేమీ కాదన్నారు. స్టార్టప్‌ రంగంలో ఆరోగ్యకరమైన పోటీకి ఈ పరిణామాలు మరింత ఊతమిస్తాయన్నారు.

No comments:

Post a Comment