వానలే వానలు !

Telugu Lo Computer
0


దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాలతోపాటు, సెంట్రల్ ఇండియాలో వారం రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వానలు మరో ఐదు రోజులపాటు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌ఘడ్, విదర్భ, మధ్య ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తునప్పటికీ, మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ డైరెక్టర్ జనరల్ ఎమ్.మోహాపాత్రా చెప్పారు. మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు, వరదల ప్రభావానికి గడిచిన 24 గంటల్లో 18 మంది మరణించారు. వీరిలో ఆరుగురు పిల్లలు ఉన్నారు. వాణిజ్య రాజధానిగా పిలిచే ముంబై మహానగరం వర్షాల కారణంగా నీట మునిగింది. ఢిల్లీలో 2 మిల్లీమీటర్లపైగా వర్షపాతం నమోదైంది. గత జూన్ నుంచి అక్కడ లోటు వర్షపాతమే నమోదైంది. కర్ణాటక, అసోంలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)