దేశ ప్రజల మధ్య ఐక్యత లోపించింది

Telugu Lo Computer
0


కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, దేశంలో ప్రస్తుత పరిస్తులను చూస్తుంటే తనకు భయంగా ఉందని, దేశీయుల మధ్య ఐక్యత లోపించిందని మునుపటిలా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు  పేర్కొన్నారు. ''దేనికైనా భయపడుతున్నారా అని నన్ను అడిగితే, అవును, భయపడుతున్నాననే చెప్తాను. ఆ భయానికి కారణం ఉంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితి నా భయం వెనుకున్న కారణం. ఎందుకంటే దేశం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది సహనానికి సంబంధించిన విషయం కాదు. దేశం మునుపటిలా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. ఇంకా ఆయన మాట్లడుతూ ''భారతదేశం కేవలం హిందువులది మాత్రమే కాదు. ముస్లింలే ఈ దేశాన్ని రూపొందించలేరు. అందరూ ఐక్యంగా ఉండి నిర్మించుకోవాలి'' అని అన్నారు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా దేశంలోని బహుళత్వాన్ని తుడి చిపెట్టే అధికారాన్ని పొందినట్టు కాదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ముస్లిం ప్రభావాన్ని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సత్యాన్ని తారుమారు చేయలేరని, ఆ విషయం మనందరికీ తెలుసని అన్నారు. భారతీయ చరిత్రలో మొఘలుల ప్రభావం ప్రధానమైనదేనని పేర్కొన్నారు. ఈ దేశం ఆర్యభట్టు దేశమని, సైన్స్ సాధనలో యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న దేశమని గుర్తు చేశారు. అష్టదిగ్గజాలు దేశ సంప్రదాయాలకు అనుగుణంగా ఐక్యంగా ఉండాలని అమర్త్యసేన్ పిలుపునిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)