అసెంబ్లీలో బల నిరూపణకు సోమవారం గడువు !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే తన ప్రభుత్వానికి ఉన్న బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అందుకు గవర్నర్ సోమవారం వరకు గడువు విధించారు. ఆ నిమిత్తం మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు సమావేశంలో స్పీకర్‌ను ఎన్నుకొని, తర్వాత ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక, శివసేనకున్న 55 మంది ఎమ్మెల్యేలలో 39 మంది తన వర్గంలో ఉన్నారని శిందే వెల్లడించారు. భాజపాకు 106 ఎమ్మెల్యేలున్నారు. కొత్త ప్రభుత్వానికి కమల దళం మద్దతు ఉండనుంది. మొత్తంగా 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు నిన్న శిందే గవర్నర్‌కు వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం స్థానాలు 288. మరోపక్క అనూహ్యంగా సీఎం అయిన ఆయన ఇక తమదే అసలైన శివసేన అని చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. తానే బాల్‌ఠాక్రే రాజకీయ వారసుడిననే సందేశాన్ని ప్రజల్లోకి పంపడం మొదలుపెట్టారు. దానిలో భాగంగా మొదట తన ట్విటర్‌ బయోలో మార్పు చేశారు. అందులో శిందే.. బాల్‌ ఠాక్రే వద్ద కూర్చొని కనిపించారు. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేసేలా ఉందా చిత్రం. తమదే అసలైన సేన అనే వాదనను సుప్రీకోర్టులో కూడా వినిపించారు. అసహజసిద్ధ కూటమితో పొత్తు పెట్టుకొని ఉద్ధవ్‌ ఠాక్రే తన తండ్రి బాల్‌ ఠాక్రే భావజాలాన్ని పక్కనపెట్టారని శిందే వర్గం వాదిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)