పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారి అరెస్ట్

Telugu Lo Computer
0


పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిని అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసింది. గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లో నిందితులకు సంబంధించిన 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది సీబీఐ. రూ. 93 లక్షలతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులతో కలిసి కుట్ర పన్నుతూ.. ప్రైవేట్ కంపెనీకి టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యుత్ మెరుగుపరచడంలో భాగంగా నార్త్-ఈస్ట్ రీజియన్, నార్త్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ స్మీమ్ కింద ఓ ప్రాజెక్టును చేపట్టింది. దీంట్లో భాగంగా పవర్ గ్రిట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారి, ప్రైవేటు కంపెనీ నుంచి భారీగా లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ రోజు జరిగిన సోదాల్లో సీబీఐ బిమ్లెందు శేఖర్ ఝా (పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇటానగర్) , దేశ్ రాజ్ పాఠక్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్ (ట్రాన్స్మిషన్ & డిస్ట్రిబ్యూషన్) టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఆర్ ఎన్ సింగ్ (అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్- డిస్ట్రిబ్యూషన్, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్)లతో పాటు టాటా ఉద్యోగులు నఫీజ్ హుస్సేన్ ఖాన్, సందీప్ కుమార్ దూబే, కుమారిలను అరెస్ట్ చేశారు. పంచకులలోని సీబీఐ న్యాయస్థానంలో హాజరుపరచగా.. ఈ నెల 15 వరకు పోలీస్ కస్టడీ విధించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)