విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేసిన టీచర్‌ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 7 July 2022

విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేసిన టీచర్‌ !


అసోంలోని దేమాజీ నగరంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజనా కేంద్రంలో విద్యార్థినికి ఓ టీచర్ సినిమా స్టైల్‌లో లవ్ ప్రపోజ్ చేశాడు. క్లాస్ మధ్యలో మోకాళ్లపై కూర్చొని విద్యార్థినికి ‘ఐ లవ్యూ’ చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సీరియస్ అయ్యారు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజనా కేంద్రంలో మనోజ్ కుంబంగ్ టీచర్‌ (ట్రైనర్‌)గా పనిచేస్తున్నాడు. క్లాసు మధ్యలో నిల్చొని ఆ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థినికి సినిమాటిక్‌గా లవ్ ప్రపోజ్ చేశాడు. దీన్ని ఇతర విద్యార్థులు సెల్‌ఫోన్‌లో బంధించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో సంబంధిత అధికారులు కుంబంగ్‌ను విధుల్లోనుంచి తొలగించారు. సదరు విద్యార్థినిని కూడా సస్పెండ్ చేశారు. ఇది ఊహించని ఘటన అని, విషయం తమ దృష్టికి రాగానే టీచర్‌తోపాటు సదరు విద్యార్థినిపై చర్యలు తీసుకున్నామని శిక్షణా కేంద్రం బాధ్యులు తెలిపారు. ఈ ఘటనను ఫోన్‌లో బంధించిన వారిపై కూడా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

No comments:

Post a Comment