ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వానలు

Telugu Lo Computer
0


ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలల్లో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా ఆంధ్రలో ముసురు వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతోపాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తాలోని తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రాయలసీమలోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద కొనసీమను తాకింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం గంటిపెదపూడి లంకలో తాత్కాలిక నదీపాయ గట్టు తెగింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పి. గన్నవరం మండలం బూరుగులంక, ఉడుముడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారి పేటకు చెందిన గ్రామాల ప్రజలు నాలుగు నెలల పాటు పడవపైనే ప్రయాణాలు చేయనున్నారు. వర్షాకాలం వస్తొందని తెలిసినా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరింత వరద పెరిగితే కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి ఎదురు బిడియం కాజ్ వేల పైకి చేరనున్న వరద నీరు చేరే అవకాశం ఉందని గ్రామస్తులు భయపడుతున్నారు. కాగా ఇప్పటివరకు అధికారులు వరదలపై ఎలాంటి సమీక్ష సమావేశం నిర్వహించ లేదని తెలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజిలోకి భారీగా వరద నీరువచ్చి చేరుతుండటంతో ఈరోజు 1,20,000 క్యూసెక్కుల నీటికి సముద్రంలోకి వదిలారు. వశిష్ట వైనితేయ గోదావరి నదిపాయల్లోకి వరదనీరు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)