మూడేళ్ళలో ఏపీ అప్పులు 3 లక్షల 7 వేల 671 కోట్లు !

Telugu Lo Computer
0


2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ తీసుకున్న రుణం మెత్తం 3 లక్షల 7 వేల 671 కోట్ల రూపాయలు అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రుణం మెత్తం 3 లక్షల 60 వేల 333 కోట్ల రూపాయలు. 2021-22 లో అదనంగా తీసుకున్న రుణం సుమారు 53 వేల కోట్ల రూపాయలు అని ఆమె వెల్లడించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ రుణం మొత్తం 3 లక్షల 98 వేల 903 కోట్ల రూపాయలుగా ఆమె వివరించారు. 2022-23 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం వివిధ అవసరాల కోసం అదనంగా తీసుకున్న రుణం 38 వేల కోట్ల రూపాయలుగా ఆమె తెలియచేశారు. అప్పులపై ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాం నుంచి ఇప్పటి వరకూ అప్పులు పెరుగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.3.80 లక్షల కోట్లుగా ఇటీవల వెల్లడించారు. అయితే, తమ ప్రభుత్వం కేంద్ర నిబంధనలకు లోబడే అప్పులు చేసిందని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్‌, ఇతర పరిస్థితుల వల్లే అప్పు పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి 1.34 లక్షల కోట్లుగా అప్పు ఉంటే ఏపీలో ద్రవ్యలోటు చాలా తక్కువని దువ్వూరి కృష్ణ వివరించారు. చంద్రబాబు హయాంలో ఏటా 19.4 శాతం అప్పులు ఉంటే.. ఇప్పుడు 15.77 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని వెల్లడించారు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.39 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఈ సందర్భంగా దువ్వూరి కృష్ణ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)