ప్రమాదవశాత్తూ నదిలో పడిన బస్సు : 12 మంది మృతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 18 July 2022

ప్రమాదవశాత్తూ నదిలో పడిన బస్సు : 12 మంది మృతి


మధ్యప్రదేశ్​లోని ధార్ జిల్లా ఖాల్​ఘాట్​ లో  దాదాపు 40 మందితో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ నర్మద నదిలో పడిపోయింది. దీంతో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. పలువురు గల్లంతయ్యారు. ఆ బస్సు ఇండోర్​ నుంచి పుణె వెళ్తుండగా వంతెనపై అదుపు తప్పి నర్మదా నదిలో పడిపోయిందని అధికారులు చెప్పారు. పోలీసులు, రెస్క్యూ బృందాల సభ్యులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టామని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు.

No comments:

Post a Comment