ఆర్తి అగర్వాల్ - తరుణ్ - ప్రియమణి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 18 July 2022

ఆర్తి అగర్వాల్ - తరుణ్ - ప్రియమణి


ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన రోజా రమణి తనయుడు తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అంజలి లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ఆకట్టుకున్నాడు. అలా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారాడు. హైదరాబాద్ లిటిల్ ప్లవర్ కాలేజీలో చదువుతున్న సమయంలోనే త్రివిక్రం కథ, మాటలతో కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రామోజీ రావు నిర్మించిన నువ్వే కావాలి సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఏడాది పాటు ఆడింది. ఆ తర్వాత అంకుల్, ప్రియమైన నీకు, అదృష్టం, నువ్వు లేక నేను లేను..ఇలా వరుసగా సినిమాలు చేశాడు. అయితే, అప్పట్లో తరుణ్ ఏ సినిమా చేస్తే ఆ సినిమాలో నటించిన హీరోయిన్‌తో ఎఫైర్, లవ్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగేది. దీనికి కారణం ఈయన చేసినవన్నీ ప్రేమ కథలు కావడం. వరుసగా ఆ సమయంలో తరుణ్ హీరోగా నటించిన సినిమాలు రావడం..ఇవన్నీ కలిపి కొత్త వార్తలు క్రియేట్ అవడానికి కారణం అయ్యాయి. అదే సమయంలో ఆర్తి అగర్వాల్, తరుణ్ కలిసి నువ్వు లేక నేను లేను, సోగ్గాడు లాంటి సినిమాలు చేశారు. వీరిద్దరు కలిసి పార్టీలకు, పబ్బులకు తిరుగుతున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు, పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని, పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు, వీరి ప్రేమకు తరుణ్ తల్లి అడ్డు పడుతుందనీ పెద్ద దుమారం రేగింది. ఆర్తీ కూడా తరుణ్ అంటే ఎంతో ఇష్టంతో ఉండేదన్న ప్రచారమే జరిగింది. ఇంతలో తరుణ్ - ప్రియమణి పెళ్లి చేసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరు కలిసి నవ వసంతం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు..సీక్రెట్ గా పెళ్లి కూడా చేసేసుకున్నారంటూ మీడియా వారే పెళ్లి చేసేశారు. ఆ తర్వాత ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తరుణ్ తల్లి కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ప్రియమణి ముస్తఫా రాజ్‌ని పెళ్ళి చేసుకొని ఆనందంగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment