సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం రూ.115 కోట్లు

Telugu Lo Computer
0


ప్రైవేటురంగ లోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికానికి రూ.115.35 కోట్ల నికరలాభానార్జించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.10.31 కోట్లే కావడం గమనార్హం. నిరర్థక ఆస్తులు తగ్గడం వల్ల, పరిమిత కేటాయింపులు జరపడం వల్లే లాభం భారీగా పెరిగిందని తెలిపింది. అయితే జనవరి-మార్చి లాభం రూ.272 కోట్లతో పోలిస్తే మాత్రం 57 శాతం తక్కువే. ఏడాది వ్యవధిలో ఆదాయం రూ.2084.39 కోట్ల నుంచి రూ.1868.15 కోట్లకు తగ్గింది. వడ్డీ ఆదాయం రూ.1633.39 కోట్ల నుంచి రూ.1621.81 కోట్లకు, ఇతర ఆదాయం 45 శాతం క్షీణించి రూ246.34 కోట్లకు పరిమితం కావడమే ఇందుకు నేపథ్యం. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 8.02 శాతం (రూ.4677.12 కోట్ల) నుంచి 5.87 శాతానికి (రూ.3798.64 కోట్ల) తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 5.05 శాతం (రూ.2855 కోట్ల) నుంచి 2.87 శాతానికి (రూ.1801 కోట్ల) దిగి వచ్చాయి. ఫలితంగా కేటాయింపులు రూ.495.89 కోట్ల నుంచి రూ.139.41 కోట్లకు పరిమితమయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)