తాడిపెద్దు బీభత్సంతో 10 మందికి గాయాలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 23 July 2022

తాడిపెద్దు బీభత్సంతో 10 మందికి గాయాలు !తాడిపెద్దు ఎద్దుల్లోకే ఎద్దు మేలు జాతి ముదురు ఎద్దు. చిర్రెత్తుకొచ్చిందంటే అది సృష్టించే బీభత్సానికి హద్దూ అదుపూ ఉండదు. కాకినాడ జిల్లాలో ఓ తాడిపెద్దు తెగబడింది.. నానా హంగామా చేసింది. తుని పట్టటణంలో నడిరోడ్లపై, జనావాసాలపై తాడిపెద్దు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు.. కనిపించినవారిని కనిపించినట్టు వెంబడించి కుమ్మిపారేసింది. రోడ్డు మీద వెళ్లే పాదచారులను, బైక్‌ల మీద వెళ్లే వారిని ఎవరినీ వదలకుండా దాడి చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 10 మందిపై దాడి చేసింది. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. మిగిలిన వాళ్లు కూడా ఏరియా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. తునిలో తిష్టవేసిన తాడిపెద్దులు.. మనుషుల్నే కాదు.. సాటి పశువుల్ని కూడా భయపెట్టించాయి. నడి రోడ్డు మీదే ఎద్దులు పోట్లాడుకుని భయాందోళన కలిగించాయి. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడేలా వణికించింది. తాడిపెద్దును అదుపుచేసి, తుని జనానికి ఉపశమనం కలిగించేందుకు మునిసిపల్ సిబ్బంది, పశుసంవర్థక అధికారులు, పోలీసులు ఒక్కటిగా చేరి తీవ్రంగా ప్రయత్నించారు. మత్తు మందు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆలోపే ఎద్దు చనిపోయింది. కుక్క కరవడం వల్ల ఆ ఎద్దుకు ర్యాబిస్ వ్యాధి వచ్చింది. అందువల్లే అలా ప్రవర్తించిందని వైద్యులు గుర్తించారు. వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో ఎద్దు ప్రాణాలు కోల్పోయింది. ఆ ఆంబోతుకు సంబంధించి ఎవరూ రాకపోవడంతో మున్సిపల్ అధికారులు.. డంపింగ్ యార్డుకు తరలించారు.

No comments:

Post a Comment