టీఆర్ఎస్ పార్టీకి రామచంద్రు తేజావత్ రాజీనామా - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 23 July 2022

టీఆర్ఎస్ పార్టీకి రామచంద్రు తేజావత్ రాజీనామా


ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మాజీ ఐఏఎస్ రామచంద్రు తేజావత్ టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం, పార్టీ తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో నిలిచిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకూడదని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం తనకు బాధ కలిగించిందని, అందుకే టీఆర్‌ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని తేజావత్ రామచంద్రు కోరారు. పార్టీకి, ప్రభుత్వానికి మరెంతో సేవ చేద్దామని అనుకున్నా, కానీ​ టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం తన సేవలను వినియోగించుకోలేదని తేజావత్ రామచంద్రు అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్తో పాటు టీఆర్ఎస్ పార్టీలో తనను భాగస్వామ్యం చేసినందుకు రామచంద్రు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా తన విధులు వంద శాతం అంకితభావంతో నిర్వర్తించానని చెప్పారు. ముఖ్యంగా కాళేశ్వరం, SRSP స్ట్రోమ్ వాటర్ ప్రాజెక్ట్ లకు అన్ని క్లియరెన్స్ వచ్చేందుకు కృషి చేసినట్లు చెప్పారు. అలాగే సికింద్రాబాద్ కరీంనగర్ రైల్వే లైన్, 3100 కిలో మీటర్ల నేషనల్ హైవే ప్రాజెక్టులు, ఎయిమ్స్, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాననన్నారు.

No comments:

Post a Comment