ఈపీఎఫ్‌పై అతి తక్కువ వడ్డీ రేటు !

Telugu Lo Computer
0


ఉద్యోగ భవిష్య నిధి వడ్డీ రేటును 8.1 శాతంగా ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021-22 ఏడాదికి గాను ఉద్యోగులు జమ చేసిన మొత్తంపై ఈ వడ్డీ రేటును అమలు చేయనున్నారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ వడ్డీరేటు కావడం గమనార్హం. ఉద్యోగ భవిష్య నిధి వడ్డీరేటు 8.1 శాతానికి తగ్గించాలన్న ఈపీఎఫ్‌ ట్రస్టు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 2021-22 ఏడాదికి ఇదే వడ్డీ రేటు అమలు చేయనుంది. ట్రస్టు ధర్మకర్తలు చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్‌వో అధికారికి తాజాగా వెల్లడించారు. గత నాలుగు దశాబ్దాల్లో ఈపీఎఫ్‌పై అతి తక్కువ వడ్డీరేటు ఇదే కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటం, ప్రభుత్వ ఆదాయం తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో తెలిపారు. ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 4 దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించించడంతో గతంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. 1977-78 ఆర్థిక సంవత్సరం లో పీఎఫ్ వడ్డీ రేటు 8 శాతం ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22కి, ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 8.1 శాతానికి తగ్గిస్తూ తీర్మానం చేశారు. ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో కొత్త వడ్డీ రేటు అమలులోకి వచ్చింది

Post a Comment

0Comments

Post a Comment (0)