దేశంలో 3,962 కరోనా కొత్త కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో నిన్న 4.45 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,962 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 0.89 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కేరళలో కలిపి మరోరోజు రెండు వేలకుపైగా కేసులొచ్చాయి. ఈ రెండింటితో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండంపై నిన్న కేంద్రం ఆయా ప్రభుత్వాలకు హెచ్చరికలు చేసింది. స్థానికంగా ఇన్‌ఫెక్షన్‌ విస్తరించడమే అందుకు కారణం కావొచ్చని అభిప్రాయపడింది. అందువల్ల తక్షణం అప్రమత్తమై కట్టడి చర్యలు తీసుకొని ఇప్పటివరకూ దక్కిన ప్రయోజనాలు చేజారకుండా చూసుకోవాలని సూచించింది. కొత్త కేసుల ప్రభావం క్రియాశీల కేసులపై పడుతోంది. ప్రస్తుతం వాటి సంఖ్య 22,416 (0.05 శాతం)కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 2,697 మంది కోలుకున్నారు. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 2020 ప్రారంభం నుంచి 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.26 కోట్ల మందిపైగా కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. 5.24 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఇక నిన్న 11.67 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తంగా 193 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)