వీఎల్-ఎస్ఆర్ సామ్ క్షిపణి పరీక్ష విజయవంతం

Telugu Lo Computer
0


ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్ తీరంలోగల ఇండియన్ నావల్ షిప్ (ఐఎన్ఎస్‌) నుంచి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి వీఎల్-ఎస్ఆర్ సామ్‌ను భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని నిట్టనిలువుగా పరీక్షించినట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. వీఎల్-ఎస్ఆర్ అనేది షిప్ బార్న్ వెపన్ సిస్టం. ఇది సీ స్కిమ్మింగ్ లక్ష్యాలతో సహా సమీప పరిధిలోని వైమానిక ముప్పులను న్యూట్రలైజ్ చేస్తుంది. ఈ రోజు హై-స్పీడ్ ఏరియల్ టార్గెట్ అనుకరించే విమానానికి వ్యతిరేకంగా పరీక్ష నిర్వహించామని, అది విజయవంతమైందని డీఆర్డీవో తెలిపింది. ఈ పరీక్షను డీఆర్డీవో, భారత నౌకాదళానికి చెందిన సీనియర్ అధికారులు పర్యవేక్షించారని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)