శివసేన కూటమితో జట్టుకట్టిన ఎంఐఎం

Telugu Lo Computer
0


రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్న ఎంఐఎం.. మరో కాషాయ పార్టీ నేతృత్వంలోని కూటమికి మద్దతు పలికింది. మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. ఈ మేరకు ఎంఐఎంకు చెందిన ఔరంగాబాద్‌ ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ ట్వీట్‌ చేశారు. హర్యానా, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరుగనున్నది. ఇందులో మహారాష్ట్రకు చెందిన ఆరు స్థానాలు ఉన్నాయి. వీటిలో ఒక స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హీ పోటీలో ఉన్నారు. దీంతో ఆయనకు మద్దతు తెలపాలని ఎంఐఎం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటేయనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)