అమెరికాలో కాల్పులలో ముగ్గురి మృతి

Telugu Lo Computer
0


అమెరికాలోని  టెక్సాస్‌ ఘటన మరువక ముందే, పశ్చిమ మేరీ ల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషిన్ ఫ్యాక్టరీలోకి చొరబడ్డ ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారని యూఎస్ మీడియా వెల్లడించింది. మేరీల్యాండ్‌లోని స్మిత్స్‌బర్గ్‌లో కొలంబియా మెషీన్ అనే మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు వాషింగ్టన్ సిటీ పోలీసులు తెలిపారు. కాల్పుల తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితుడిని ఘటనా స్థలానికి కొద్ది దూరంలో మేరీల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కాగా.. గత కొన్ని రోజులుగా అమెరికాలో హింస పెరుగుతూ వస్తోంది. న్యూయార్క్, టెక్సాస్, ఓక్లహోమాలో జరిగిన ఘటనల్లో పదుల సంఖ్యలో మరణించారు. టెక్సాస్ ఘటనలో 22 మంది మరణించారు. కాగా.. తుపాకీ హింసను నియంత్రించేందుకు.. చట్టాలను మరింత కఠినం చేసేలా జోబైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుపాకుల కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)