హైకోర్టు అడ్వకేట్ శిల్పను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 23 June 2022

హైకోర్టు అడ్వకేట్ శిల్పను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ


హైకోర్టు అడ్వకేట్ శిల్పను అదుపులోకి ఎన్ఐఏ అధికారులు తీసుకున్నారు. రాధ అనే యువతి మిస్సింగ్ కేసులో భాగాంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి శిల్ప ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. శిల్ప ఇంట్లో పలు డాక్యుమెంట్స్ ను పరిశీలించారు. శిల్పను అదుపులోకి తీసుకొని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. రాధ అనే మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ను మావోయిస్టుల్లో చేర్చారంటూ శిల్ప పై కేసు నమోదైంది. 2017లో తన కూతురిని బలవంతంగా మావోయిస్టుల్లో చేర్చించారంటూ శిల్ప, దేవేందర్, బండి కిరణ్ లపై రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఎఫ్ఆర్ఐ  ఆధారంగా నిందితుల ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసి అడ్వకేట్ శిల్పను అదుపులోకి తీసుకున్నారు.  అడ్వకేట్ శిల్పను అదుపులోకి తీసుకోవడంపై ఆమె భర్త బండి కిరణ్ ఫైర్ అయ్యారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. విచారణ కోసం అని చెప్పి ఎన్ఐఏ ఆఫీస్ కి తీసుకెళ్లారని చెప్పారు. చైతన్య మహిళ సంఘానికి శిల్ప రిజైన్ చేసి చాలా రోజులైందని.. కావాలనే తమను కేసుల పేరుతో వేధిస్తున్నారన్నారు. రాధ అనే అమ్మాయి ఎవరో తమకు తెలియదన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలపై పోరాడుతున్నందుకు తమపై కక్ష్య గట్టి సంబంధం లేని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో కూడా కేసులు పెట్టి శిల్పను జైలుకు పంపారన్నారు.

No comments:

Post a Comment