600 మొబైల్ ఫోన్ టవర్లు మాయం !

Telugu Lo Computer
0


జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉండగా, దాని ప్రాంతీయ కార్యాలయం చెన్నైలోని పురసవాక్కంలో ఉంది. కంపెనీ భారతదేశం అంతటా 26,000 మొబైల్ ఫోన్ టవర్లను ఏర్పాటు చేసి నిర్వహించింది. ఒక్క తమిళనాడులోనే 6 వేలకు పైగా మొబైల్ ఫోన్ టవర్లను ఏర్పాటు చేసింది. 2018లో ఈ కంపెనీ భారీ నష్టం కారణంగా తన సేవలను నిలిపివేసింది. దీంతో దేశవ్యాప్తంగా అమర్చిన మొబైల్ ఫోన్ టవర్ల నెట్‌వర్క్ సేవలు నిలిచిపోయాయి. తమిళనాడులో ఈ మొబైల్ టవర్లు పని చేయనప్పుడు, దానిని పర్యవేక్షించే కంపెనీలు కోవిడ్ -19 కాలంలో టవర్ సైట్‌కి వెళ్లి పర్యవేక్షణ మరియు నిర్వహణను చేయలేకపోయాయి. ఇటీవల ఇతర నెట్‌వర్క్ అవసరాల కోసం పనిచేయని మొబైల్ ఫోన్ టవర్లను పరిశీలించడానికి అధికారులు వెళ్లినప్పుడు, ఈరోడ్ జిల్లాలో ఒక మొబైల్ టవర్ కనిపించకుండా పోయిందని తెలియడంతో వారు షాక్ అయ్యారు. దీంతో టవర్ ఉన్న పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు ఆ తర్వాత తమిళనాడు వ్యాప్తంగా మొబైల్ ఫోన్ టవర్లు పనిచేయని పరిస్థితి పై జరిపిన సర్వేల్లో 600లకు పైగా టవర్లు మాయమైనట్లు తేలింది. ప్రత్యేకించి కోవిడ్-19 లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ లేనపుడు వారి మొబైల్ ఫోన్ టవర్‌లను దొంగిలించారని సంస్థ ఆరోపించింది. ఇది కేవలం ఒక టవర్ మాత్రమే పరిమితమవలేదన్నారు. ఇప్పటివరకు 600 టవర్లు మాయమయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఒక టవర్ ఏర్పాటు చేయడానికి రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని, ప్రస్తుతం కోట్లలో నష్టం వాటిల్లిందని కంపెనీ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)